పోల్ గేమ్ : ఏ ఉగాది మూవీ కి మీ ఓటు ?

Poll Game: Which Movie Are You Watching This Ugadi?

కృష్ణవంశీ రంగ మార్తాండ: హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో మరాఠీ సూపర్ హిట్ నట సామ్రాట్ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగ మార్తాండ మూవీ ఉగాది కానుకగా మార్చి 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అనసూయ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా ముఖ్య పాత్రలలో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీకి మెగా స్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశ్వక్ సేన్ ధమ్కీ: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0, 2.0 ట్రైలర్‌ ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.

కాజల్ కోస్టి : సీడ్ పిక్చర్స్ బ్యానర్ పై కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ హారర్ ఘోష్టి తమిళ మూవీ తెలుగు వెర్షన్ కోస్టి మూవీ ఉగాది కానుకగా మార్చీ 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దర్శకుడు కె ఎస్ రవికుమార్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్యాప్ తరువాత కాజల్ నటించిన ఈ మూవీ పై భారీ గా అంచనాలు ఉన్నాయి.

ఆదర్శ్ గీత సాక్షిగా : చేతన్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వంలో ఆదర్శ్ , చిత్రా శుక్ల జంటగా మహిళల సమస్యల నేపథ్యం లో తెరకెక్కిన గీత సాక్షిగా మూవీ ఉగాది కానుకగా మార్చి 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ అయ్యంగార్ , రూపేష్ శెట్టి , అనిత చౌదరి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పోల్ గేమ్ :ఏ ఉగాది మూవీ కి మీ ఓటు ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here