ఫైనల్ స్టేజ్ లో రణబాలి షూటింగ్

Ranabaali Shoot Enters the Final Stage
Ranabaali Shoot Enters the Final Stage

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణబాలి షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విజయవంతంగా 100 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇటీవల గండికోటలో జరిగిన కీలక షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం టాకీ పార్ట్‌ను ముగించుకుంది. బ్రిటీష్ పాలనా కాలంలో 1854 – 1878 మధ్య జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, గుల్షన్ కుమార్ మరియు భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పాన్-ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తుండగా, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ చారిత్రక కథలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూతో పాటు బెనెడిక్ట్ గారెట్, జెఫ్రీ గిలియానో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోద్ తమ్మినేని ఈ చిత్రానికి రచన అందించారు.

సాంకేతిక విభాగంలోనూ ఈ సినిమా కోసం అగ్రశ్రేణి నిపుణులు పనిచేస్తున్నారు. అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతలను, కార్తీక శ్రీనివాస్ ఆర్. ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్, రాబిన్ సుబ్బు ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. విఠల్ కోసనమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సునీల్ రాజు చింతా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్న ఈ భారీ చారిత్రక చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.