రిలీజ్ అయిన #PVT 04 మూవీ జోజు జార్జ్ ఫస్ట్ లుక్ పోస్టర్

#PVT04 Movie Villain First Look Out Now

బ్లాక్ బస్టర్ ఉప్పెన మూవీ తో హీరోగా టాలీవడ్ కు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఉప్పెన మూవీ విశేష ప్రేక్షకాదరణ తో భారీ వసూళ్లు సాధించి , 100 కోట్ల క్లబ్ లో చేరింది. వైష్ణవ్ కథానాయకుడిగా తెరకెక్కిన కొండపొలం , రంగ రంగ వైభవంగా మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా వైష్ణవ్ ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , శ్రీలీలే జంటగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #PVT 04 మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో విలన్ గా నేషనల్ అవార్డు విన్నర్ మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ నటిస్తున్నారు. ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జార్జ్ , వైష్ణవ్ తేజ్ సినిమాలో చెంగా రెడ్డి పాత్ర లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ జోజు జార్జ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తున్న ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.