దసరా ట్రైలర్ పై ఆది పినిశెట్టి రియాక్షన్స్

aadhi pinisetty interesting comments on dasara movie trailer

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి అయిపోయింది. పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అంతేకాదు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని టాలీవుడ్ కు శుభశకునాన్ని సూచించాయి. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా. నాని హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ ట్రైలర్ పై ఆది పినిశెట్టి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా ట్రైలర్ రియల్, రా మరియు రస్టిక్ గా అదిరిపోయిందని.. నాని బాబాయ్, కీర్తి సురేష్ ఇది మీ బెస్ట్ లలో ఒకటి అని అన్నారు. మార్చి 30 న థియేటర్లలో విడుదల అవుతుంది. ఈసినిమాను చూడటానికి వేచి ఉండలేను అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eleven =