నటీనటులు : నాగశౌర్య ,మాళవిక నాయర్ ,మేఘా చౌదరి , అభిషేక్ మహర్షి
దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల
సంగీతం : కళ్యాణి మాలిక్
ఎడిటింగ్ : కిరణ్ ఘంటి
సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్
నిర్మాతలు : టి జి విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీనివాస్ అవసరాల దర్శత్వం లో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి‘. హిట్ కాంబినేషన్ కావడం అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
సంజయ్ ( నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్ ) ల జీవన ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ సినిమా కథ. కథలోకి వెళితే.. సంజయ్,అనుపమ ఒకే కాలేజ్ లో బీటెక్ చదువుతారు. సంజయ్ కి అనుపమ సీనియర్. ఒకానొక సందర్భంలో సంజయ్ ను సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే అనుపమ కాపాడుతుంది. అలా ఇద్దరు పరిచయమవుతారు. ఆతరువాత స్నేహం చేస్తారు అది కాస్త ప్రేమకు దారిస్తుంది. ఆ తరువాత వారి లవ్ జర్నీ లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ క్రమంలో ఇద్దరు విడిపోతారు. దానికి గల కారణం ఏంటి ?ఇంతకీ వాళ్లిద్దరూ చివరికి ఒక్కటయ్యారా? అనేదే మిగితా కథ.
విశ్లేషణ:
శ్రీనివాస్ అవసరాల , నాగశౌర్య కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘ఉహాలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద’ చూస్తే సినిమాలో కథ చాలా సింపుల్ కానీ వాటిని డీల్ చేసిన విధానం ఆకట్టుకుంది కాబట్టే ఆసినిమాలు విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు ఈ ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి విషయం లోనూ దర్శకుడు అదే ఫాలో అయిపోయాడు. కథలో కొత్తదనం లేదు కానీ దాన్ని తెర మీదకు తీసుకువచ్చిన విధానం బాగుంది. సింపుల్ స్టోరీ ని ప్రేక్షకుల కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీనివాస్ అవసరాల మరో సారి సక్సెస్ అయ్యాడు. చాలా సన్నివేశాలు చాలా సహజంగా వుంటాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది. శ్రీనివాస్ అవసరాల బలం రైటింగ్. ఆ బలాన్ని ఈ సినిమాలో మరో సారి వాడుకున్నాడు. సినిమాలో వచ్చే కామెడీ ,ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఈసినిమా కు లీడ్ పెయిర్ మరో హైలైట్ గా చెప్పొచ్చు. నాగ శౌర్య , మాళవిక నాయర్ ల కెమిస్ట్రీ అద్బుతంగా వుంది. డిఫ్రెంట్ చాప్టర్ లు వున్న ఈ చిత్రంలో నాగ శౌర్య మేక్ ఓవర్ బాగుంది అలాగే హీరోయిన్ మాళవికకు కూడా మంచి పాత్ర దక్కింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంత ఇద్దరు ఎలా పరిచయమయ్యారు, ఆ తరువాత ఫ్రెండ్ షిప్ అది కాస్త ప్రేమ గా ఎలా మారింది అని చూపెట్టారు. ఇందులో వచ్చే సన్నివేశాలు చాలా వరకు ఎంగేజ్ చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో బ్రేక్ అప్ తరువాత వారు పడ్డ సంఘర్షణ, చివరకు కథ ఎలా సుఖాంతమైంది అనేది చూపెట్టారు. అయితే కథ ఇంకా బలంగా ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఓవరాల్ గా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా చాలా వరకు ఆకట్టుకుంటుంది.
పెర్ఫామెన్స్:
నాగ శౌర్య కు ఇది అలవాటైన పాత్రే . ఈ పాత్రలో శౌర్య చాలా ఈజీ గా చేసుకుంటూ వెళ్ళాడు. కథలో భాగంగా డిఫరెంట్ లుక్స్ తో కనిపించాడు. హీరోయిన్ మాళవికకు మంచి స్కోప్ వున్న పాత్ర దక్కింది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లోకెల్లా ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాను లిమిటెడ్ క్యారెక్టర్ లతో తెరకెక్కించారు అలాగే చాలా వరకు కొత్త వారిని తీసుకున్నారు అయితే వారు కూడా తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
టెక్నికల్ వాల్యూస్ :
తీర్పు :
ఓవరాల్ గా మంచి అంచనాలతో వచ్చిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఆ అంచనాలను అందుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ,స్క్రీన్ ప్లే , సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో హైలైట్స్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు.
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి మూవీ ట్రైలర్ :
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.