సలార్- ఇటలీలో యాక్షన్ మోడ్ లో ప్రభాస్

pan india star prabhas action mode in italy

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య బ్రేక్ లు లేకుండా షూటింగ్ ను జరుపుతుంది చిత్రబృందం. ఈనేపథ్యంలోనే సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని అంటున్నారు. ప్రభాస్, విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ పోర్షన్స్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే అని తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =