న్యాచురల్ స్టార్ నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ ,టీజర్ , సాంగ్స్ సినిమాకు ఎక్కడ లేని హైప్ ను తీసుకొచ్చాయి. ఇక ఈ రోజు ట్రైలర్ కూడా విడుదలకానుంది. ఈట్రైలర్ కూడా అదిరిందని టాక్ వినిపిస్తుంది. దాంతో ఈసినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రంలో నాని తో పాటు కీర్తి సురేష్ నటన కూడా హైలైట్ కానుందట. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కీర్తి, మహానటి రేంజ్ యాక్టింగ్ చేసిందని టాక్. వెన్నెల పాత్రలో పల్లెటూరి అమ్మాయి గా కీర్తి నటన ఆకట్టుకోనుందట. ఇక నాని , కీర్తి కలిసి నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేను లోకల్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి దసరా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
దసరాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసాడు. అతనికి ఇదే మొదటి చిత్రం. అయితే ఈ సినిమా తోని శ్రీకాంత్ భారీ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది. ఈసినిమాకి తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగు తో పాటు హిందీ ,తమిళ,కన్నడ ,మలయాళ భాషల్లో ఈనెల 30న దసరా భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























