సలార్ మూవీ కై భారీ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ ?

Pan India Star Prabhas Salaar Movie Team Plans Huge Promotional Campaign

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ కానున్న సలార్ మూవీ కై దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వేసవికి అభిమానుల్లో జోష్ నింపేలా టీజర్‌, గ్లింప్స్ వీడియో, పోస్టర్లు.. ఇలా ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్‌ ఫిక్స్‌ అయ్యారనీ సమాచారం. మొత్తానికి ప్రభాస్‌ కున్న క్రేజ్‌ను ప్రశాంత్‌ నీల్‌ పర్‌ఫెక్ట్‌గా వినియోగించుకుంటూ సలార్‌ మార్కెట్‌ పెంచుకోవాలన్న ఆలోచన బాగుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.