స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈమూవీ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన నాటు నాటు పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డ్ గోస్ టు నాటు నాటు అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు.హాలీవుడ్ సాంగ్స్ ను అధికమిస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకొననడం విశేషం. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక కావడం మాత్రమే కాదు.. అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: