టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాా ఈసినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెప్తాము అని ప్రకటించారు. అయితే ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: