అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Siva gets released from #Custody!!✌️
That’s a wrap for Yuvasamrat @chay_akkineni & they are all set for Grand World wide release on May 12th!! 😍🔥#CustodyOnMay12 💥@IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @abburiravi @SS_Screens #TeluguFilmNagar pic.twitter.com/gnmu7jnIxX— Telugu FilmNagar (@telugufilmnagar) February 24, 2023
కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి మరో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: