ఆర్ఆర్ఆర్ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ‘RC 15’ పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. పలు కీలక ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర షూట్ జరుపుకున్న చిత్రబృందం.. అక్కడి నుండి కర్నూల్ కు వెళ్లింది. అక్కడ షూట్ ను ముగించుకున్న ఈ చిత్రయూనిట్ వైజాగ్ కు షిప్ట్ అయింది. రామ్ చరణ్, శంకర్ సహా టెక్నీషియన్స్ అందరూ విశాఖలోని గీతం యూనివర్సిటీలో సందడి చేస్తున్నారు. అక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































