వరుస బ్లాక్ బస్టర్ అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NBK 108 మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోని మూడో వారంలో ప్రారంభం కానుందనీ.. ఈ సినిమాలో ఇదే కాస్ట్లీ షెడ్యూల్ అనీ సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో కనిపించనున్నారనీ.. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.
బాలయ్య మొత్తం ఈ సినిమాలో మూడు గెటప్స్ లో కనిపించబోతున్నారనీ.. బాలయ్య పాత్ర ఒక్కటే అయినా.. మూడు స్టేజ్ ల్లో మూడు లుక్స్ లో బాలయ్య కనిపిస్తారనీ.. ముప్పై ఏళ్ల యువకుడి గెటప్ తో పాటు ఏభై ఏళ్ల వ్యక్తిగా.. అలాగే డెబ్బై ఏళ్ల పెద్దాయన గా కూడా బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నారనీ.. బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























