ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీశ్ కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘హాయ్ రే’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘చిన్ని చిన్ని’ సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ గీతం ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతిని అందించేలా రూపొందింది.చికిరి చికిరి ఫేమ్ ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహన్ వోకల్స్ , థమన్ స్కోర్ పాటను రిపీట్స్ లో వినేలా వున్నాయి. “స్వేచ్ఛ అనేది ప్రేమకు అత్యంత మధురమైన వ్యక్తీకరణ” అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో ఈ పాటను మేకర్స్ ప్రేక్షకులకు అందించారు.ఓవరాల్ గా సాంగ్స్ తోనే సూపర్ బజ్ తెచ్చుకుంటుంది ఈసినిమా.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నూతన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























