కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్న తమిళ క్లాసిక్ చిత్రం ‘డిసి’ ప్రేక్షకులను మరియు సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాను వీక్షించిన ప్రముఖులు ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన కావ్యంతో పోలుస్తూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన విశిష్టమైన చిత్రంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసినిమాను తిలకించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సినిమాను ఒక అద్భుతమైన తమిళ క్లాసిక్‌గా అభివర్ణించిన ఆయన, సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమని కొనియాడారు. అర్థం చేసుకునే వారికి ఈ సినిమా ఒక కవిత్వం లాంటిదని ప్రశంసించారు.
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ వర్క్ పట్ల అత్యున్నత గౌరవాన్ని వ్యక్తం చేసిన అల్లు అర్జున్, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతాన్ని ‘మాస్టర్ బూస్టర్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాల్లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందన్న అల్లు అర్జున్, ముఖ్యంగా వామిఖ గబ్బి నటనను, అలాగే హీరోగా మెప్పించిన లోకేష్ కనగరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్ట్‌కి బిగ్గెస్ట్ పిలర్గా నిలిచిన లోకేష్ కనగరాజ్ శ్రమను కొనియాడుతూ, ‘డిసి’ చిత్రబృందం మొత్తానికి తన తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























