సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం నుంచి బ్రహ్మానందం డివైన్ గింప్స్ రిలీజ్

Brahmanandam’s Divine Glimpse from Sumanth’s Mahendragiri Varahi Released

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ బ్రహ్మానందం పాత్రని పరిచయం చేస్తూ పవర్ఫుల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. గ్లిమ్స్ లో బ్రహ్మానందం అమ్మవారిని ప్రార్థిస్తున్న భక్తుని పాత్రలో డివైన్ ఫుల్ గా కనిపించారు. అమ్మ వారాహి మా మహేంద్రగిరిని కాపాడు తల్లి అని ప్రార్థిస్తున్నా ఈ గ్లిమ్స్ చివర్లో అమ్మవారు దర్శనం గూజ్ బంప్స్ అనుభూతి కలిగించింది. 

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.