మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. అయితే మధ్యలో చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు చిరు తన తరువాత సినిమా భోళా శంకర్ పై ఫోకస్ ను పెట్టారు. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నేడు చిరు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కు సెట్స్ లోకి చిరుకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భోళా శంకర్ పోస్టర్ ముందు డైరెక్టర్ అండ్ టీం సమక్షంలో కేక్ కట్ చేశారు చిరంజీవి. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A MASSive Welcome to Boss after scoring a Mega Mass Blockbuster🔥
Team #BholaaShankar welcomes Megastar @Kchirutweets to the sets in a Grand Way🤘🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @prakash3933 @AKentsOfficial @adityamusic pic.twitter.com/LrxMKIuf4w
— BholāShankar (@BholaaShankar) January 19, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: