వీరసింహారెడ్డి- రచ్చ లేపుతున్న బాలయ్య డైలాగ్స్

Veera Simha Reddy Trailer Dialogues Get Super Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Trailer,Balakrishna Latest Movie Trailer,Veera Simha Reddy Trailer,Veera Simha Reddy Movie Trailer,Veera Simha Reddy Telugu Movie Trailer,Veera Simha Reddy Telugu Trailer,Balakrishna Veera Simha Reddy Trailer,Jai Balayya,Jai Balayya Slogan,Jai Balayya Slogan Dialogue,Veera Simha Reddy Trailer Jai Balayya Slogan Dialogue,Nandamuri Balakrishna,Jai Balayya Veera Simha Reddy Dialogue,Veera Simha Reddy Dialogue,Veera Simha Reddy Movie Dialogues,Veera Simha Reddy Trailer Dialogues

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఒంగోలు లో అర్జున్‌ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. టాప్ 1 ట్రెండింగ్ లో తన హవా చాటుతుంది. గోపిచంద్ మలినేని మాస్ కు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ నిరూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ లో బాలకృష్ణ పేల్చిన ఒక్కోక్క డైలాగ్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్‌ను పక్కా యాక్షన్ డోస్‌తో నింపేశాడు గోపీచంద్. నిజానికి బాలకృష్ణ ప్రతి సినిమాలో ఆయన మార్క్ డైలాగ్స్ ఉంటూనే ఉంటాయి. ఈసినిమాలో కూడా అలాంటి డైలాగ్స్ చాలానే ఉంటాయని ట్రైలర్ ను చూస్తూ అర్థమవుతుంది. సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలునాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీద ఎఫెక్షన్‌.. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్‌ అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి ట్రైలర్ లోనే ఇలా ఉంటే.. సినిమా మొత్తం ఇంకా ఏ రేంజ్ లో డైలాగ్స్ ఉంటాయో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. ఇంకా ఈసినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =