తెలుగు సినిమాలు మంచి లాభాలు ఇస్తాయి

Karan Johar Shocking Comments On Bollywood Actors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Karan Johar,Karan Johar Latest News,Karan Johar News,Karan Johar Telugu Movies,Karan Johar New Post,Karan Johar Latest Post,Karan Johar Latest Interview,Karan Johar New Interview,Karan Johar Comments On Bollywood Actors,Karan Johar On Bollywood Actors,Karan Johar About Bollywood Actors,Karan Johar About Telugu Movies,Karan Johar About Tollywood Movies,Karan Johar About Tollywood Industry,Karan Johar Shocking Comments On Celebrities Remuneration,Bollywood Producer Karan Johar,Producer Karan Johar,Karan Johar Comments On Celebrities Remuneration,Celebrities Remuneration,Karan Johar Upcoming Movies,Karan Johar Movie Updates,Karan Johar Movie News,Karan Johar Latest Film Updates

బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వంలో వహించిన కరణ్ జోహార్ ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి ఆ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నాడు. టాప్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వారసులను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడం వరకూ అందరి సినిమాలను నిర్మిస్తుంటాడు. అందుకే నెపోటిజం పేరుతో కరణ్ జోహార్ పలు విమర్శలను సైతం అందుకుంటూ ఉంటాడు. ఇక ఒకవైపు హిందీలో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు పలు తెలుగు సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటూ అక్కడ రిలీజ్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా కరణ్ జోహర్ బాలీవుడ్ హీరోల గురించి.. రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా ఇప్పుడవి హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహన్.. సినిమా అనేది ఓ ఎమోషన్. నా మనస్సు ఎప్పుడూ హిందీ చిత్రాలపైనే ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తారలు మాత్రమే ఎక్కువగా సంపాదిస్తున్నారు. నా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఇద్దరు వ్యక్తులతో స్టార్టప్ లా మొదలైంది. యశ్ చోప్రా చెప్పినట్లు సినిమా ఫలితాన్ని బడ్జెట్ నిర్ణయిస్తుంది. నేను అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో తీసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్స్ మాత్రం రాలేదు..సినిమా బడ్జెట్‌లో చాలా వరకూ స్టార్ హీరోలకే వెళ్లిపోతోంది. బాలీవుడ్‌లో కొంత మంది హీరోలు తొలి రోజు కనీసం రూ.5 కోట్లు కలెక్షన్స్ కూడా రాబట్టలేరు. కానీ రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ కావాలని అడుగుతున్నారు.. కానీ ఓ వ్యాపారవేత్తగా చెప్పాలంటే తెలుగు చాలా లాభదాయకమైన సినీ పరిశ్రమ అని నేను భావిస్తున్నాను అంటూ తెలిపారు. చూద్దాం మరి కరణ్ వ్యాఖ్యలపై ఎవరు రెస్పాండ్ అవుతారో.. ఎలాంటి కామెంట్స్ ఎదురవుతాయో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.