సందీప్ కిషన్ హీరోగా, జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తొలి రెండు సింగిల్స్ కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. గాంధీ జయంతి హాలిడేతో పాటు ఆ తర్వాత వీకెండ్ కూడా కలిసిరావడంతో ఈ రిలీజ్ డేట్ సినిమాకు మంచి అడ్వాంటేజ్ కానుంది.
రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో సందీప్ కిషన్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. వార్మ్ లైటింగ్‌తో ఉన్న ఇంటీరియర్‌లో ఓ డాగ్ పక్కన నిలబడి, కిటికీ నుంచి వస్తున్న గోల్డెన్ సన్‌లైట్ మధ్య కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్. హరిహరసుతన్ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























