మాచర్ల నియోజకవర్గం- ఓటీటీలో సూపర్ రెస్పాన్స్

Macherla Niyojakavargam Movie Gets Super Response In OTT, Macherla Niyojakavargam Movie Super Response, Macherla Niyojakavargam Movie OTT, Macherla Niyojakavargam OTT, Nithiin, Krithi Shetty, Catherine Tresa, Swara Sagar Mahathi, M.S. Rajashekhar Reddy, Nithiin Movies, Nithiin Latest Movie, Nithiin Upcoming Movie, Macherla Niyojakavargam, Macherla Niyojakavargam 2022, Macherla Niyojakavargam Movie, Macherla Niyojakavargam Update, Macherla Niyojakavargam Latest News, Macherla Niyojakavargam Telugu Movie, Macherla Niyojakavargam Movie Live Updates, Macherla Niyojakavargam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

గత ఏడాది పలు సినిమాలతో అలరించిన నితిన్ ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌లైంది. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో మొద‌టి సారిగా నితిన్ పూర్తి స్థాయి భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది నితిన్ కు. ఇక ఈసినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే ఓటీటీలో మాత్రం ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈసినిమా ఈ నెల 9 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ 75 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి సత్తా చాటుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈసినిమాకు దర్శకత్వంవహించాడు. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడికి పరిచయం అయ్యాడు. ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటించింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రెడ్డి సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్స్ రాసి రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. మరోవైపు రాజప్ప (సముద్రఖని) మాచర్ల నియోజకవర్గం లో ఓటమి ఎరుగని పొలిటీషియన్. తనకు పోటీగా వచ్చిన వారిని అడ్డుతప్పించి అసలు పోటీనే లేకుండా ఎలక్షన్స్ లో గెలుస్తుంటాడు. ఇక అదే మాచ‌ర్లకు చెందిన స్వాతి త‌న నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌పై సాయం కోసం ఎదురు చూస్తుంటుంది. అతనికి ఎదురుతిరుగుంది. దీంతో ఆమెను చంప‌టానికి రాజ‌ప్ప ప్ర‌య‌త్నిస్తాడు. స్వాతిని సిద్ధార్థ్ కాపాడుతాడు. రాజ‌ప్ప గురించిన నిజం అత‌నికి తెలుస్తుంది. అదే స‌మ‌యంలో అత‌నికి గుంటూరు జిల్లాకే క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌స్తుంది. ఇక అక్కడికి వెళ్లిన సిద్ధార్థ్ రాజ‌ప్ప‌ను ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే సినిమా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =