దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్

Dil Raju Announces New Production House, Dil Raju New Production House, New Production House, Producer Dil Raju, Priyadarshi, Kavya Kalyanram, Bheems Ceciroleo, Priyadarshi Movies, Priyadarshi Latest Movie, Priyadarshi Upcoming Movie, Balagam, Balagam 2023, Balagam Movie, Balagam Update, Balagam Latest News, Balagam Telugu Movie, Balagam Movie Live Updates, Balagam Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంటుంది. సక్సెస్ ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉంటారా అన్నట్టు తను నిర్మించే సినిమాల్లో చాలా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంటాయి. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు తెలుగులో సక్సెస్ బాటలో నడుస్తున్న దిల్ రాజు ఇప్పుడు పక్క ఇండస్ట్రీలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలను లైన్ లో పెట్టిన దిల్ రాజు తమిళ్ లో కూడా సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన కెరీర్ లోనే మైలు రాయిగా వస్తున్న 50వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో శంకర్ లాంటి డైరెక్టర్ తో ప్లాన్ చేశాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇక ఇప్పుడు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాడు. తన పేరు మీదే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త సంస్థను ప్రకటించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్నదే కొత్త బ్యానర్ ప్రారంభించడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.అంతేకాదు ఈ ప్రొడక్షన్ హౌస్ లో అప్పుడే ఒక సినిమాను కూడా ప్రారంభించాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చాడు దిల్ రాజు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో బలగం అనే సినిమాను ఈ నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కావ్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =