భవదీయుడు భగత్ సింగ్-షూట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్?

Pawan Kalyan Green Signal To Bhavadeeyudu Bhagat Singh Movie Shooting, Bhavadeeyudu Bhagat Singh Movie Shooting, Bhavadeeyudu Bhagat Singh Shooting, Pawan Kalyan Green Signal, Power Star Pawan Kalyan, Pawan Kalyan, Pankaj Tripathi, Pooja Hegde, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movie, Bhavadeeyudu Bhagat Singh, Bhavadeeyudu Bhagat Singh 2023, Bhavadeeyudu Bhagat Singh Movie, Bhavadeeyudu Bhagat Singh Update, Bhavadeeyudu Bhagat Singh Latest News, Bhavadeeyudu Bhagat Singh Telugu Movie, Bhavadeeyudu Bhagat Singh Latest Update, Bhavadeeyudu Bhagat Singh Live Updates, Bhavadeeyudu Bhagat Singh Latest News And Updates, Bhavadeeyudu Bhagat Singh Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. దీంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఎప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ సినిమాలతో పాటు ఇప్పుడు ఎక్కువ సమయం రాజకీయల్లో గడుపుతుండటంతో లిస్ట్ లో ఉన్న సినిమాలు పెండింగ్ లో పడ్డాయి. ఈనేపథ్యంలోనే ఎప్పుడో పూర్తవ్వాల్సిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఇంతవరకూ పూర్తికాలేకపోయింది. దీంతో హరీష్ శంకర్ సినిమా అయితే అసలు ఇప్పట్లో లేనట్టే అన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకానొకదశలో ఈసినిమా ఆగిపోయిందన్న కథనాలు కూడా వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. లేట్ అవుతుందేమో కానీ ఆగిపోదు అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. భవదీయుడు భగత్ సింగ్ మూవీని మొదలెట్టేందుకు పవన్ స్టార్ యూనిట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజా సమాచారం ప్రకారం అతి త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక పూజా కార్యక్రమాలతో పాటు మూవీ షూట్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. చూద్దం మరి ఇందులో ఎంత నిజముందో..

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి గబ్బర్ సింగ్ తరువాత రానున్న సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =