హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Hit 2 Movie Teaser Release Date Fixed, Hit 2 Telugu Movie Teaser, Hit 2 Movie Teaser, HIT 2 Teaser Date Announced, Adivi Sesh, Nani, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh latest movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో హిట్ సినిమా కూడా ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఆద్యాంతం వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ట్విస్ట్ లతో అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఆమధ్య అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి మంచి బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసందర్భంగా ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవీడియోలో శైలేష్ కొలను.. హిట్‌2’ ఎంజాయ్‌ చేయాలంటే ‘హిట్‌-1’ చూడక్కర్లేదని, కానీ ‘హిట్‌1’ చూస్తే ‘హిట్‌2’ ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారని తెలిపాడు. ఇక హిట్-3 గురించి కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, హీరో అడివి శేష్ వచ్చి.. హిట్ 2 రిలీజ్ కాకుండానే, హిట్ 3 గురించి చెప్పేస్తావా అంటూ ప్రశ్నించాడు. ముందు హిట్ 2 సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను చెప్పమనగా.. నవంబర్ 3న హిట్-2 టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించాడు. మొత్తానికి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =