దసరా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

keerthy suresh first look is out from dasara movie, Nani’s Dasara, Keerthy Suresh’s First Look, Keerthy Suresh’s First Look Poster, Nani, Keerthy Suresh, Srikanth Odela, Nani Latest Movie, Nani’s Upcoming Movie, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా. శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో మొదటి సారి నాని ఫుల్‌ లెంగ్త్‌ ఊరమాస్‌ క్యారెక్టర్‌ చేస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఒకపక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క అప్ డేట్స్ ఇస్తూనే వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. రీసెంట్ గానే ధూమ్ ధామ్ దోస్తానా అనే మాస్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫుల్ మాసీగా ఉన్న ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు కీర్తి సురేష్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్‌ చేస్తూ బర్త్ డే విషెస్ అందించారు. ఈసినిమాలో కీర్తిసురేష్ వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లో బరాత్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు పోస్టర్‌లో ఉంది. పోస్టర్ మాత్రం ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 9 =