AGS ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి , నయనతార , అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ తని ఒరువన్ తమిళ మూవీ ఘన విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ తని ఒరువన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ మూవీ ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో హీరో రామ్ చరణ్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ధృవ పాత్ర కై ఎంతో కష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు మోహన్ రాజా ఒక ఇంటర్వ్యూ లో ధృవ సీక్వెల్ ధృవ2 మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ రాజా మాట్లాడుతూ .. ఇప్పటికే తని ఒరువన్ 2 మూవీ కి కథ సిద్ధం చేశాననీ , పార్ట్ 1 కంటే పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా ఉంటుందనీ , జయం రవి తో పాటు రామ్ చరణ్ కూ ధృవ 2 కథ ను వినిపించాననీ , రామ్ చరణ్ కు కథ బాగా నచ్చిందనీ , అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సరైన సమయం లోనే ధృవ 2 మూవీ పట్టాలెక్కనుందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: