స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ ఫ‍్యామిలీ మ్యాన్ 2 హిందీ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ వెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ , సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో రా ఏజెంట్ గా పలు యాక్షన్ సీన్స్ లో పెర్ఫార్మ్ చేయాల్సి ఉండగా సమంత ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానున్నదని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: