ఒకపక్క PS1 మరోపక్క గాడ్ ఫాదర్-ఆనందంలో పేరెంట్స్

Jayam Ravi And Mohan Raja Parents Picture Goes Viral, Mohan Raja Parents Picture Goes Viral, Jayam Ravi Parents Picture Goes Viral, Jayam Ravi And Mohan Raja Parents, Hero Jayam Ravi, Director Mohan Raja, Chiranjeevi, Salman Khan, Nayanthara, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather, Godfather Telugu movie, Godfather New Update, Godfather Telugu Movie New Update, Godfather Movie, Godfather Latest Update, Godfather Movie Updates, Godfather Telugu Movie Live Updates, Godfather Telugu Movie Latest News, Godfather Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒక సినిమా హిట్ అయితే చిత్రయూనిట్ ఎంత హ్యీపీగా ఫీలవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక
తమ పిల్లలు సూపర్ హిట్లను కొడితే పేరెంట్స్ ఆనందానికి కూడా హద్దులు ఉండవు. ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఉన్నారు ఎడిటర్ మోహన్. ఎడిటర్ మోహన్ గురించి తెలుగు సీనీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’, ‘హిట్లర్’, ‘బావా బావమరిది’, ‘మామగారు’ వంటి సినిమాలను నిర్మించారు. ఇక ఈసినిమాలు ఎంత హిట్టయ్యాయో తెలిసిందే. మరి ఆయన కొడుకులే మోహన్ రాజా, తమిళంలో స్టార్ హీరో అయిన జయం రవి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రీసెంట్ గా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్, అలానే పొన్నియన్ సెల్వన్ సినిమాలు ఎంత హిట్టయ్యాయో చూస్తున్నాం. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అయినప్పుటికీ మోహన్ రాజా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి చిరు నుండి ఎలాంటి అంశాలను కావాలని కోరుకుంటారో.. ఫ్యాన్స్ కు అలానే తెలుగు ఆడియన్స్ కు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో వాటిని యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఆవిషయంలో మోహన్ రాజా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు థియేటర్లను కూడా పెంచుతున్నారు.

మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమాలో జయం రవి కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రస్తుతం పలు రికార్డులను సైతం కొల్లగొడుతుంది. ఈసినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను కొల్లగొడుతుంది. ఇక తన ఇద్దురి కొడుకుల సినిమాలు సూపర్ హిట్లు అవ్వడంతో మోహన్ కూడా చాలా ఆనందంలో ఉన్నారు. ఈవిషయాన్ని మోహన్ రాజా తన ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఒక పక్క పొన్నియన్ సెల్వన్ పోస్టర్, మరోపక్క గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్ ఉండగా తన పేరెంట్స్ రెండు పోస్టర్లతో దిగిన ఫొటోను పేర్ చేస్తూ.. ప్రౌడ్ పేరెంట్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.