యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుండి ట్రెండీ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ప్రకటించిన విధంగా ‘ది వెడ్డింగ్ సాంగ్’ ఫుల్ సాంగ్‌ను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ పాటకు తన ప్రత్యేకమైన, ఎనర్జిటిక్ గాత్రం అందించడం ఈ పాటకే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఒక స్టార్ హీరో మరో చిత్రంలోని సాంగ్‌ను పాడటం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
రాక్‌స్టార్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ మరియు క్యాచీ బీట్స్ వెడ్డింగ్ వైబ్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి.
రామజోగయ్య శాస్త్రి అందించిన అందమైన సాహిత్యం, శేఖర్ మాస్టర్ డిజైన్ చేసిన స్టెప్స్ ఈ పాటను ప్రతి పెళ్లి వేడుకలో మార్మోగే సెలబ్రేషన్ సాంగ్‌గా నిలపడం ఖాయంగా కనిపిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమితా బైజుతో పాటు రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























