కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నూతన దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
మొదటి రోజు ప్రీమియర్లు మరియు రెగ్యులర్ షోలు అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹12.30 కోట్లకు పైగా గ్రాస్ (₹7.56 కోట్ల నెట్/షేర్) వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.విడుదలకు ముందు వేసిన ప్రత్యేక ప్రీమియర్ల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ₹3.13 కోట్ల గ్రాస్ వసూలైంది (2026లో ఒక లవ్ స్టోరీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లభించిన అత్యధిక వసూళ్లు ఇవే).
ఇక నార్త్ అమెరికా సహా ఇతర విదేశీ మార్కెట్లలో ప్రీమియర్లతో కలిపి దాదాపు ₹2.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.కిరణ్ అబ్బవరం కెరీర్ గతంలో వచ్చిన ‘క’ సినిమా రికార్డులను అధిగమించి, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు ₹15 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగాయి. ఈ ఊపు చూస్తుంటే మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వచ్చి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































