బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బెస్ట్ మూవీ ?

Which Puri Jagannadh Movie Impressed You The Most, Puri Jagannadh Movies, Director Puri Jagannadh Movies, Badri, Itlu Sravani Subramanyam, Amma Nanna O Tamila Ammayi, Pokiri, Chirutha, Puri Jagannadh Latest Movies, Puri Jagannadh Upcoming Movies, Director Puri Jagannadh, Puri Jagannadh, Puri Jagannadh New Movie, Best Films Of Director Puri Jagannadh, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బద్రి : విజయ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బద్రి మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం : ఎస్ వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి: కె ఎల్ ఎన్ రాజు సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ , ఆసిన్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న ఈ మూవీ లో హీరో రవితేజ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను అలరించారు.

పోకిరి : ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పోకిరి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీ 4 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

దేశముదురు :యునివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు మూవీ ఘనవిజయం సాధించింది. అల్లు అర్జున్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.

చిరుత : వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ , నేహశర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ చిరుత మూవీ ఘనవిజయం సాధించి 40 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. మొదటి చిత్ర మైనా హీరో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తండ్రి (మెగా స్టార్ చిరంజీవి ) కి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బిజినెస్ మేన్ : ఆర్ ఆర్ మేకర్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బిజినెస్ మేన్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన పూరి జగన్నాథ్ బెస్ట్ డైరెక్టర్ గా TSR – TV 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా సంతోషం ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.

ఇద్దరమ్మాయిలతో : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ ఘనవిజయం సాధించింది. హీరో అల్లు అర్జున్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2013 సంవత్సరంలో ఈమూవీ ఓవర్సీస్ లో 175 +స్క్రీన్స్ లో రిలీజ్ కావడం విశేషం.

టెంపర్ : పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ టెంపర్ మూవీ ఘనవిజయం సాధించింది. కరెప్టెడ్ , క్రిమినల్ మైండ్ పోలీస్ ఆఫీసర్ గా తరువాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారడం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ఎన్టీఆర్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. టెంపర్ మూవీ తమిళ భాషలో అయోగ్య గా రీమేక్ అయ్యి తిరిగి తెలుగు లో డబ్బింగ్ కావడం విశేషం.

ఇస్మార్ట్ శంకర్: పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019 జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ హీరో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బెస్ట్ మూవీ ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here