బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ టీజర్ రిలీజ్

Dance Ka Booth Song Teaser From Brahmastra Out Now,Brahmastra Movie Third Song, Dance Ka Bhoot Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Brahmastra, Brahmastra Movie, Brahmastra Telugu Movie, Brahmastra Movie Updates, Brahmastra Telugu Version Movie,Brahmastra Movie Third Song Teaser Out Now,Brahmastra Movie 3rd Song Dance Ka Bhoot Teaser Out Now.Brahmastra Dance Ka Bhoot Teaser Out Now,Ranbir Kapoor and Alia Bhaat Upcoming Movie Brahmastra,Ranbir Kapoor Upcoming Movie Brahmastra

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర”. పురాతనకాలంలో అస్త్రాలు, వాటి ప్రత్యేకతలు.. ప్రస్తుతం అవి ఉండి ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అసలు ఈ అస్త్రాలు వాటి వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. అందులో మొదటిభాగం సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈసినిమాపై ఇక్కడ కూాడా మంచి అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. కుంకుమల అనే పాట అలానే దేవ దేవ అనే పాటలు రిలీజ్ అయ్యాయి. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో పాట కూడా రాబోతుంది. డ్యాన్స్ కా బూత్ అనే పాట టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాట రణబీర్ యొక్క పాత్రను చూపించేవిధంగా ఉంది. ఈసినిమాలో రణబీర్ కపూర్ డీజే గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈపాటలో డీజే కట్స్ కూడా చూపించారు. మొత్తానికి టీజర్ ను బట్టి ఈపాట కూడా మంచి డ్యాన్సింగ్ నెంబర్ అయ్యేలా కనిపిస్తుంది. మరి ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం…

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 9 =