ధమాకా ఫస్ట్ సింగిల్ రిలీజ్

Dhamaka First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie First Single Released,Trinadha Rao Nakkina,Director Trinadha Rao Nakkina,Trinadha Rao Nakkina Dhamaka Movie First Single Released,Mass Song Released From Dhamaka Movie,Dhamaka First Single Mass Song Released,Ravi Teja and sreeleela Upcoming Movie Dhamaka,Mass Maharaj Ravi Teja

మాస్ మహారాజా రవితేజ మాత్రం తన స్పీడును ఏమాత్రం తగ్గించట్లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది తను ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినా కూడా రవితేజ నిరాశ చెందకుండా తన తరువాత సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఇలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ధమాకా సినిమా నుంచి మాస్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. జింతాకా అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే ఈ పాటలో..రవితేజ శ్రీ లీలా మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు.

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =