కార్తికేయ 2 సినిమాకు పెరుగుతున్న థియేటర్లు

New Theaters Added For Karthikeya 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates, Karthikeya 2, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 New Theaters Added, Karthikeya 2 Super Hit Movie, Karthikeya 2 Movie Response,Karthikeya 2 Movie Response in North,Karthikeya 2 Latest Movie Response From North,Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupam Kher,Adithya Menon,Viva Harsha,Srinivasa Reddy

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు ఈసినిమా సీక్వెల్ గా వచ్చింది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా రిలీజ్ మాత్రం లేట్ అయిందనే చెప్పొచ్చు. ఈసినిమా రిలీజ్ కు ముందు పలు సమస్యలే ఎదుర్కొంది. నిఖిల్ కూడా తన సినిమా రిలీజ్ కు థియేటర్లు దొరకడం సమస్యగా ఉందని చెప్పి కూడా బాధపడ్డాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను నిజం చేస్తూ సూపర్ హిట్ ను అందుకుంది. అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ కూాడా అదే రేంజ్ లో అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. నిజానికి ఈసినిమాను నార్త్ లో ప్రమోషన్స్ చేసింది కూడా లేదు. సినిమాలో కంటెంట్ ఉండే మౌత్ టాక్ ఉంటే చాలు అని ఈసినిమా మరోసారి నిరూపించింది. నార్త్ లో కూడా ఈసినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే అక్కడ కూడా ఈసినిమాకు తక్కువ థియేటర్లలో తక్కువ షోలే పడ్డాయి. కానీ ఈసినిమాకు క్రేజ్ పెరగడంతో రెండు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టుకోవడంతో పాటు థియేటర్లు కూడా పెంచుతున్నారు. ఇప్పటికే పలు థియేటర్లు పెంచగా..నేటి నుండి మరికొన్ని థియేటర్లు పెంచనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 4 =