హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్

Prabhas Wishes Saif Ali Khan on His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Prabhas,Pan Indian Star Prabhas, Prabhas Wishes Saif Ali Khan,Prabhas Wishesh Saif Ali Khan on His Birthday,Prabhas Wishes Bollywood Star Saif Ali Khan on His Birthday,Saif Ali Khan Birthday,Bollywood Star Hero Saif Ali Khan,Prabhas Upcoming Movies,Prabhas Latest Movie Salaar Release Date Updates,Happy Birthday Saif Ali Khan

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోనున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సైఫ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే నేడు సైఫ్ తన పుట్టిన రోజు జరుపుకుంటుండగా చిత్రయూనిట్ కూడా సైఫ్ కు బర్త్ డే విషెస్ అందించారు. ఈనేపథ్యంలో ప్రభాస్ కూడా సైఫ్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్.. ఈ ఏడాదంతా మీకు బెస్ట్ గా ఉండాలి.. ఆదిపురుష్ లో మీ పెర్ఫామెన్స్ చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =