‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sharwanand Oke Oka Jeevitham Movie Release Date Announced,Telugu Filmnagar, Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates, Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Movie Latest Updates,Oke Oka Jeevitham Movie Release Date Announced,Sharwanand Oke Oka Jeevitham Movie Release Date Announced, Sharwanand,Hero Sharwanand,Sharwanand Upcoming Movie Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie Officially Annoiunced Release Date,Sharwanand Upcoming Movies,Sharwanand New Movie Updates

గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన శర్వానంద్ ఈ ఏడాది ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ రిలీజ్ కు మాత్రం చాలా లేట్ అయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే టీజర్ తరువాత ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతు వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుండగా.. ఇంకా అమల అక్కినేని, నాజర్, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =