మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. 1965 కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు పక్క కంట్రీస్ లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్లలో విడుదల చేయకుండా నిషేధించాయి. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించారు. ఆ సన్నివేశాలను తొలగించి మళ్లీ సెన్సార్ బృందాన్ని సంప్రదించాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే దుల్కర్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: