మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినిమా..?

Bimbisara or Sita Ramam- Which Film Impressed you the most?,Sita Ramam Or Bimbisara: Which Movie Are You Watching This Weekend? Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam Or Bimbisara,Sita Ramam Or Bimbisara Which Movie you Watch this Weekend,Best Weekend Movies in Telugu To watch,Sita Ramam Or Bimbisara Super Hit Movies This Weekedend To Watch, Sita Ramam Or Bimbisara Movie Updates,Sita Ramam Or Bimbisara Latest Movies,Sita Ramam and Bimbisara Blockbuster Movies to Watch This Weekend, Kalyan Ram Bimbisara or Dulquer Salmaan Sita Ramam Super Hit Movies To watch This Weekend,Best Movie to Watch This Weekend,Most Impressed Movies This Weekend Bimbisara or Sita Ramam Movies, Most Impressed Movies Kalyan Ram Bimbisara and Sita Ramam Dulquer Salmaan Movie

శుక్రవారం వచ్చిందంటే సినీ లవర్స్ గుర్తొచ్చేది సినిమా. అయితే కరోనా తరువాత పరిస్థితులు కాస్త మారిపోయాయనుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే శుక్రవారం సినిమా రిలీజ్ అనేది మాత్రం కామనే. ఇక ఈ శుక్రవారం కూడా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఒకటి. మరొకటి దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లలో తెరకెక్కిన సినిమాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బింబిసార సినిమా టైమ్ ట్రావెలింగ్ సోషియో ఫాంటసీ సినిమా. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ రాజు పాత్రలో మరొకటి నార్మల్ పాత్రలో నటించాడు. మల్లిడి విశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతూ రిలీజ్ అయిన ఈసినిమా మొదటి షో నుండి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి సినిమా అయినా విశిష్ట్ ఈసినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు అంటున్నారు. మొత్తానికి డిఫరెంట్ ఫీలింగ్ ను ఈసినిమా కలిగిస్తుందన్న టాక్ ను సొంతం చేసుకున్నారు.

మరోవైపు సీతారామం.. ఇది ప్యూర్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ. పీరియాడిక్ లవ్ స్టోరీగా నేడు రిలీజ్ అయిన ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమ, యుద్దం అనే పాయింట్ ను తీసుకొని హను రాఘవపూడి మరొకసారి మరో మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు అంటున్నారు. ఇక ముఖ్య పాత్రల్లో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న లపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరి డిఫరెంట్ కథనాలతో వచ్చిన ఈరెండు సినిమాల్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినిమా..?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =