‘సీతారామం’ పై సామ్ ప్రశంసలు..!

Samantha praises Sita ramam movie team, Dulquer Salmaan, Dulquer Salmaan Sita Ramam Movie, Dulquer Salmaan Sita Ramam Movie Gets Support From Samantha, Hero Dulquer Salmaan, latest telugu movies news, Samantha Kushi Movie Updates, Samantha Latest Movie Updates, Samantha New Movie Updates, Samantha Support Dulquer Salmaan upcoming Movie Sita Ramam, Samantha Upcoming Movies, Sita Ramam, Sita Ramam Gets Love And Support From Samantha, Sita Ramam Movie, Sita Ramam Movie Latest Updates, Sita Ramam Telugu movie, Sita Ramam Upcoming Movie, Star Hero Dulquer Salmaan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates

హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న మరో అందమైన ప్రేమకథ సీతారామం. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. 1965 కాలంలో వార్ బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాపై స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కరిపించింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన సమంత దీనిపై స్పందిస్తూ పొయిటిక్ గా అలానే బ్యూటిఫుల్ గా ఉందని తన ట్విట్టర్ లో పేర్కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో రష్మిక మంద‌న్నా క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా సుమంత్, భూమికా చావ్లా, త‌రుణ్ భాస్క‌ర్, ప్ర‌కాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌ష్ట్ 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 6 =