నందమూరి ఫ్యాన్ మృతి.. బింబిసార టీమ్ సంతాపం..!

Nandamuri Fans Passes Away In Bimbisara Event, Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Telugu Filmnagar, Nandamuri Fans Passes Away, Bimbisara Event, Nandamuri Fan's Demise At Bimbisara Event, Nandamuri fans at Bimbisara Event, Nandamuri Fan Sai Ram, Bimbisara Movie, Bimbisara Movie Latest Update, Bimbisara Movie Pre Release Event, Bimbisara Movie Trailer, Bimbisara Movie Update, Bimbisara Movie Updates, Bimbisara Songs, Bimbisara Teaser, Bimbisara Telugu Movie, Bimbisara Telugu Movie Updates, Bimbisara Trailer, Bimbisara Updates, Hero Kalyan Ram, Hero Kalyan Ram About Bimbisara Movie, Jr NTR, Jr NTR Latest News, Jr NTR speech at Bimbisara Pre Release Event, Jr NTR Speech Highlights, Jr NTR Speech Highlights at Bimbisara Movie Pre Release Event, Jr NTR Super Speech at Bimbisara Movie Pre Release Event, Kalyan Ram, Kalyan Ram About Bimbisara, Kalyan Ram About Bimbisara Movie

ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో తన అభిమాన హీరోలను చూద్దామని ఎంతో సంతోషంతో వస్తుంటారు అభిమానులు. తమ హీరోలు ఇచ్చే స్పీచ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తుంటాం.. కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చేయడం అలానే ఏర్పాట్ల వల్ల ఒక్కోసారి.. ఇంటికి వెళ్లే మార్గంలో ఇలా పలు ఘటనల వల్ల ఫ్యాన్స్ మృతి చెందటం చూస్తుంటాం. ఇక తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. విశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బింబిసార. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన సాయిరాం అనే అభిమాని మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ కూడా తమ అభిమాని మృతిపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఒక దురదృష్టకర ఘటన తమకు చాలా బాధకు గురి చేసిందని అది ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఒక నోట్ విడుదల చేశారు. గత రాత్రి ఈవెంట్ కి హాజరయిన పుట్టా సాయిరాాం మనకు లేరని.. వెస్ట్ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలానికి చెందిన సాయి రామ్ డై హార్డ్ నందమూరి అభిమాని అని పేర్కొన్నారు. ఇక వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నామని.. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here