ప్రస్తుతం పలు మూవీస్ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. విదేశాలలో షూటింగ్ అంటే సర్వ సాధారణం అయిపొయింది. ఒకప్పుడు విదేశాలలో షూటింగ్ జరపాలంటే శ్రమ , ఖర్చు తో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు ఉండేవి కావు. అటువంటిది 4 దశాబ్దాల క్రితమే అమెరికా లో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు చిత్రం గా”హరే కృష్ణ హలో రాధ “మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భరణి చిత్ర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై సి వి శ్రీధర్ దర్శకత్వంలో హీరో కృష్ణ , శ్రీ ప్రియ , రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన”హరే కృష్ణ హలో రాధ “మూవీ 1980 సంవత్సరం జనవరి 1 వ తేదీ రిలీజ్ అయ్యింది. ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు చిత్రాన్ని అమెరికాలో దర్శకుడు చిత్రీకరించారు.కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయడం కాకుండా, అమెరికాలో షూటింగ్ చేయాలనే అభిప్రాయంతో దర్శకుడు శ్రీధర్ ఈ చిత్ర కథను తయారు చేయడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో కృష్ణ, తమిళ వెర్షన్‌లో శివ చంద్రన్ హీరోలుగా నటించారు. శ్రీప్రియ, రతి రెండు భాషల్లోనూ నటించారు. తెలుగులో సత్యనారాయణ విలన్‌గా నటించారు. అమెరికాలో ఉన్నన్ని రోజులూ ఫుడ్ విషయంలో మాత్రం యూనిట్ ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇప్పుడైతే అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వారే ఉన్నారు కానీ ఆ రోజుల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. “హరే కృష్ణ.. హలో రాధ” చిత్రంలో తాను నటించక పోయినప్పటికీ హీరో కృష్ణతోపాటు అమెరికా వెళ్లిన విజయనిర్మలప్రతి రోజూ ఫుడ్ ఐటెమ్స్‌ను వండి, షూటింగ్ స్పాట్‌కు తీసుకు వెళ్ళి యూనిట్‌లో అందరికీ వడ్డించే వారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: