సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక షూటింగ్ లేకపోతే మహేష్ తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతాడన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇక ఎప్పటిలాగే సర్కారు వారి పాట తరువాత వెకేషన్ కు వెళ్లిపోయారు. ఫ్యామిలీతో సహా ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఆయన క్వాలిటీ టైం గడుపుతున్నారు. ఇక అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పలు ఫొటోలను పంచుకుంటూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో రీసెంట్ గా బిల్ గేట్స్ ను కలిశారు. బిల్‌గేట్స్ ను కలిసిన ఫొటోని ఫ్యాన్స్‌తో పంచుకున్న మహేష్, బిల్‌గేట్స్‌ని కలవడం సంతోషంగా ఉందని.. ప్రపంచంలో గ్రేటెస్ట్ విజనరీ ఉన్న, అత్యంత గౌరవమైన, ప్రోత్సాహకరమైన వ్యక్తి అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బిల్ గేట్స్ కూడా మహేష్ కు రిప్లై ఇవ్వడం. న్యూయార్క్ లో ఉండటం ఎప్పుడూ ఫన్ గానే ఉంటుందని.. ఎప్పుడు ఎవరిని కలుస్తామో చెప్పలేం.. నిన్ను నమ్రతను మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా మహేష్ బాబుని సోషల్ మీడియాలో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Being in New York is always fun – you never know who you’ll run into. It was great meeting you and Namrata! https://t.co/qBykgcXDS6
— Bill Gates (@BillGates) June 30, 2022
ఇక తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా వ్యవహరించబోతోన్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























