మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ ఈ రోజు (జులై 1 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
” పక్కా కమర్షియల్” మూవీ టీమ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన స్నేహితుడు గోపీచంద్ కి, హీరోయిన్ రాశి ఖన్నాకి, అలానే డైరెక్టర్ మారుతీతో పాటు మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రభాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ “పక్కా కమర్షియల్” మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: