ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి. ఈసినిమా కార్తికేయ2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో రూపొందించాడు. ఇక ఈసీక్వెల్ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో డబ్బింగ్ పనులను ముగించుకుంటున్నారు. తాజాగానే అనుపమ తన డబ్బింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఈనేపథ్యంలో నిఖిల్ తన ట్విట్టర్ తను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను పోస్ట్ చేస్తూ హిందీ డబ్బింగ్ ఇన్ ప్రొగ్రెస్ అంటూ అప్ డేట్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Karthikeya2 #HindiDub in Progress 🎙 pic.twitter.com/9XkgY5xnGL
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2022
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: