రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. ఈసినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దసరా సినిమాతో బిజీ అయిపోయాడు. ఇన్ని రోజులు అంటే సుందరానికి సినిమాతో బిజీగా ఉండగా ఆసినిమా అయిపోవడంతో ఇప్పుడు దసరా పై ఫోకస్ ను పెట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే చివరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త రూమర్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని.. మళ్లీ స్క్రిప్ట్ వర్క్ పై, యాక్షన్ సీన్స్ పై పని చేస్తున్నారని.. అంతేకాదు బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని గత పుకార్లు వినిపిస్తున్నాయి. అన్ని పుకార్లను కొట్టివేస్తూ ట్వీట్ చేసిన నెటిజన్ కు దర్శకుడు ఒక మీమ్ తో గట్టిగానే రిప్లై ఇచ్చాడు. మరి ఈ రిప్లై తో రూమర్స్ ఇప్పటికైనా ఆగిపోతాయేమో చూద్దాం..
https://t.co/oc0uFhyp2k pic.twitter.com/X9H3aJNHfD
— srikanth odela (@odela_srikanth) June 29, 2022
కాగా ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: