‘మేజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Major OTT Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Movie latest Updates,Major Movie On OTT,Major Movie Releasing in OTT, Major Movie in Netflix on 3rd July,Major Movie on 3rd July Releasing on 3rd July,Adivi Sesh major Movie Releasing on 3rd July, Major Movie Releasing on 3rd July in Netflix,Adivi Sesh Latest Super Hit movie in Netflix on July 3rd,Major Movie Streaming on Netflix From 3rd July

విభిన్నమైన కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ మేజర్ తో మరో హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. అడివిశేష్ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌శికిర‌ణ్ టిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా జూన్3న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ నిర్వహించగా అప్పుడే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో కూడా రిలీజ్ అయి అంతే ప్రేక్షకాదరణ పొందింది. శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. అడివి శేష్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజ‌ర్ నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుండి ‘మేజ‌ర్’ చిత్రం స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌కటించారు. అంతే ఈసినిమా రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వస్తుంది.

కాగా ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలిసి సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏప్లస్ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇంకా ఈసినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, శోభితా ధూళిపాళ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − one =