రాహుల్ విజయ్-శివాని కొత్త సినిమా ప్రారంభం..!

Rahul Vijay And Shivani Rajasekhar New Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rahul vijay,Hero Rahul vijay,Rahul vijay upcoming Movies,Rahul vijay New Movie updates,Rahul vijay Movie with Shivani Rajashekar,Shivani Rajashekar,Actress Shivani Rajashekar, Shivani Rajashekar Upcoming movie with Rahul Vijay,Shivani Rajashekar Uocming movies,Shivani New movie updates,Shivani lates Movie updates, Rahul Vijay And Shivani Rajasekhar Movie launched,Rahul Vijay New Movie launched

టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని తెలిసిందే కదా. ఈ బ్యానర్ నుండి అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇక ఈబ్యానర్ కు అనుసంధానంగా రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అల్లు అరవింద్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన బన్నీ వాసు ఈ బ్యానర్ లో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ స్టార్ట్ చేసి తక్కువ కాలమే అయినా కూడా మంచి పేరును సొంతం చేసుకుంది. ఈబ్యానర్ ద్వారా యంగ్ హీరోలకు అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు పలు సినిమాలు కూడా ఈ బ్యానర్ నుండి వచ్చినవే. మరోవైపు గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను సిద్దం చేస్తున్నారు. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాహుల్ విజయ్-శివాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fourteen =