టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కార్తికేయ2 సినిమా కూడా ఒకటి. చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ2 సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది..అనే మాటలతో మొదలైంది ట్రైలర్. అసలు కృష్ణుడేంటి..ఈ కథను ఆయనే నడిపించడమేంటి అని నిఖిల్ అడగడం… విశ్వం ఒక పూసల దండ..ప్రతీది నీకు సంబంధమే అని ఓ పూజారి అనడం.. మొత్తాని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని కలగజేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది ట్రైలర్.
3 Years of Blood Sweat and Much more… TRAILER OF #KARTHIKEYA2 is here….
Watch it and if u like it Please SHARE with ur friends and family …. #LordKrishna India’s Epic Mystical AdventureZee Cinemalu YouTube – https://t.co/9fYA4X0cHm pic.twitter.com/x0DcBSrIqn
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 24, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా శ్రీనివాస్ రెడ్డి బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందిస్తుండగా చేస్తుండగా..కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: