అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈ సినిమా పూర్తి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా జూన్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ గెటప్ లో కిచ్చా సుదీప్ కనిపిస్తున్నారు. ‘ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథను దాచాలని అనుకుంటున్నారు. కథని దాచగలరు. కానీ, భయాన్ని దాచలేరు. ఆ కథ మళ్ళీ మొదలైంది. ఆ డెవిల్ మళ్ళీ వచ్చాడు’ అని ఒక అమ్మాయి చెప్పడంతో ట్రైలర్ మొదలైంది. ఇన్స్పెక్టర్ సురేష్ కృష్ణ హత్యతో పాటు ఆ ఊరిలో జరిగిన మరొకొన్ని హత్యల వెనుక నిజాలను వెలికితీసే అధికారి పాత్రలో సుదీప్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. మొత్తానికి స్టోరి, యాక్షన్ సీక్వెన్స్ , గ్రాఫిక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Wishing @KicchaSudeep garu all the very best !! #VikrantRonatrailer looks quite exciting! 🥂
Here’s the Telugu Trailer : https://t.co/eEHhOILSMz@anupsbhandari @JackManjunath @shaliniartss @InvenioF @ZeeStudios_ @laharimusic @neethaofficial @Asli_Jacqueline
— Ram Charan (@AlwaysRamCharan) June 23, 2022
కాగా జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల కానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.