ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ చర్చలు సఫలం..!

Film Chamber Function with Film Federation Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Film Federation,Tollywood Film Federation,Telugu Film Federation,Film Federation and Film Chamber,Film Chamber Function, Cinema Union Strike,Cinema Union,Dil Raju,Producer Dil Raju,Cinematography Minister Talasani Srinivas Yadav,TRS Minister Talasani Srinivas YadavFilm Federation President Anil,Anil Film Federation President

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకొని ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే కదా. తమ కనీస వేతనాలు పెంచమని సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు షూటింగ్ లకు కూడా వెళ్లకుండా తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో చాలా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. మరోవైపు కనీస వేతనాలకు సంబంధించి సమ్మె నోటీసులని మా దృష్టికి ఫెడరేషన్ తీసుకురాలేదని నిర్మాతల మండలి తెలుపగా.. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాత్రం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఈ విషయాన్ని తెలియజేస్తూ లెటర్ లు ఇచ్చామని చెప్పడంతో వివాదం కాస్త ముదిరింది. కార్మికులకు వేతనాలు పెంచడానికి మాకేం అభ్యంతరం లేదని.. కార్మికులు షూటింగ్ లకు హాజరైతేనే కనీస వేతనాలపై చర్చిస్తామని.. అంతే కాకుండా పాత పద్దతిలోనే 15 రోజుల పాటు కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలకు వెల్లడించింది. ఈ కండీషన్స్ కు సినీ కార్మికులు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం కాస్త సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వద్దకు చేరింది. ఆయన ఇరు పక్షాల నేతలతో చర్చలు జరిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరగగా అవి ఫలించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ..తలసాని గారు చోరవతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వేతనాలు రేపు కోర్డినేషన్ కమిటీ లో ఛాంబర్ ,ఫెడరేషన్ డిసైడ్ చేసి ఆమోదించటం జరుగుతుంది.. రేపటి నుంచి యధావిధిగా చిత్రీకరణలు జరుగుతాయనితెలిపారు. విధివిదానాలను దిల్ రాజు చైర్మన్ గా ఏర్పాటు చేసిన కోర్డినేషన్ కమిటి ద్వారా నిర్ణయిస్తామని కొల్లి రామకృష్ణ తెలిపారు.

ఇక ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ మాట్లాడుతూ.. వేతనాలు పెంచటానికి నిర్మాతలు సిద్దమయ్యారు.. రేపటి నుంచి కార్మికులు చిత్రీకరణ లకు వెళతారు.. సమస్యలను కోర్డినేషన్ కమిటీ ద్వారా సాల్వ్ చేసుకుంటామని తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =